బిగ్ బాస్-2లో ఆమె ఉందా..!

బిగ్ బాస్ తొలి సీజన్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయగా స్టార్ మా ఇప్పుడు అంతే ఉత్సాహంతో బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు సిద్ధం అవుతుంది. ఈ సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా కనిపిస్తున్నాడు. ఈమధ్యనే దీనికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. బాబాయ్ ఈసారి కొంచం మసాలా అంటూ బిగ్ బాస్-2 ఈసారి కాస్త ఘాటుగానే ఉంటుందని చెప్పకనే చెప్పాడు. ఇక ఈసారి కంటెస్టంట్స్ పరంగా కూడా అంతా సెలబ్రిటీసే అంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం పూనం కౌర్ బిగ్ బాస్-2 కంటెస్టంట్ గా ఉండబోతుందని టాక్.

త్రివిక్రం, పవన్ కళ్యాణ్ ఇష్యూలో బాగా పాపులర్ అయిన పూనం ఈమధ్య ట్విట్టర్ వేదికగా ఆమె కూడా అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసిన వారిని ఎటాక్ చేస్తుంది. ఆమె మాటలను బట్టి చూస్తే త్రివిక్రం ను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బిగ్ బాస్-2లో ఆమె ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. ఇక వీరే కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఇందులో పాటిస్పేట్ చేయబోతున్నారని తెలుస్తుంది.