చిరు అల్లుడు సర్ ప్రైజ్ చేశాడు..!

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో విజేత సినిమాతో కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈమధ్యనే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా రీసెంట్ గా సినిమాలో కళ్యాణ్ దేవ్ లుక్ ని రివీల్ చేశారు. మెగా మేనియా కొనసాగించేలా కుర్రాడు కూడా బాగానే ఉన్నాడనిపిస్తుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.


చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ విజేతను వాడేస్తున్న కళ్యాణ్ దేవ్. మొదటి సినిమా నుండి మెగా ఫ్యాన్స్ ను బుట్టలో వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో వస్తున్న ఈ సినిమా చిరు అల్లుడికి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి. ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేసిన కళ్యాణ్ దేవ్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.