
ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి సెలబ్రిటీస్ తమకి ఎవరైనా ఎలాంటి ఛీలెంజ్ అయినా చేస్తే దానికి తగిన రెస్పాండ్ అవుతున్నారు. ఈమధ్య కాలంలో ఈ విధమైన కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. ఇక లేటెస్ట్ గా క్రీడా శాఖా మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఓ ఛాలెంజ్ మొదలుపెట్టారు. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ హ్యాష్ ట్యాగ్ తో ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలో తాను పుషప్స్ చేస్తూ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, కోహ్లిలకు ఛాలెంజ్ చేశాడు.
ఇక అలా మొదలైన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ అక్కినేని వారసుడు అఖిల్ దగ్గరకు వచ్చింది. పివి సింధు ఛాలెంజ్ స్వీకరించి అఖిల్ ను నామినేట్ చేయగా అఖిల్ ఆనందంగా ఈ ఛాలెంజ్ స్వీకరించి మరో నలుగురిని ఇందుకు నామినేట్ చేశాడు. అఖిల్ వర్క్ అవుట్స్ చేసి తన తరపున అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరో వరుణ్ థావన్ లను నామినేట్ చేశాడు. మొత్తానికి హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ ఈ రేంజ్ లో స్టార్స్ ను ప్రభావితం చేయడం మంచి విషయమే అని చెప్పొచ్చు.