
దేవదాస్ సినిమాతో ఎనర్జిటిక్ స్టార్ గా అవతరించిన రామ్ యువ హీరోల్లో తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు. స్టార్ స్క్రీన్ నేం వచ్చినా తగినంత హడావిడే చేయడం కుదరని రామ్ ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరియర్ సాగిస్తున్నాడు. ఇక ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాధ రావు డైరక్షన్ లో హలో గురు ప్రేమకోసమే షూటింగ్ జరుగుతుంది.
అది కాకుండా గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఓ సినిమా అనుకున్నారు. స్రవంతి రవికిశోర్ నిర్మాణంలో ఆ సినిమా పట్టాలెక్కాల్సింది. కాని తను అడిగిన బడ్జెట్ ఇచ్చేందుకు నిరాకరించగా దర్శకుడు ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. రామ్ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రవీణ్ రేంజ్ కు అడిగిన బడ్జెట్ కాస్త ఎక్కువయ్యిందని చెప్పుకుంటున్నారు. మరోపక్క డైరక్టర్ ప్రవీణ్ సత్తారు మాత్రం సినిమాలో హీరో ఆర్మీ ఆఫీసర్ కచ్చితంగా అనుకున్న బడ్జెట్ వస్తేనే చేయడం కుదురుతుందని చెప్పాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకుండానే అటకెక్కేసింది.