
మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో కళ్యాణ్ దేవ్ ఎంట్రీ కన్ఫాం అయిన సంగతి తెలిసిందే. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా విజేత అని పెట్టడం విశేషం. విజేత అనగానే మెగాస్టార్ నటించిన సినిమా గుర్తుకురావడం సహజం. మొదటి సినిమానే మెగా స్టాంప్ తో వస్తున్నాడు కళ్యాణ్ దేవ్.
సాయి కొర్రపాటి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. టైటిల్ పోస్టర్ చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంటల్ మూవీ అని తెలుస్తుంది. తప్పకుండా మెగా ఫ్యాన్స్ అభిమానాన్ని అందుకునేలా కళ్యాణ్ దేవ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే అరడజను పైగా హీరోలున్న మెగా ఫ్యామిలీలో ఈ విజేత హీరో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.