భరత్ భామ చరణ్ తో వర్క్ అవుట్స్..!

సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టిన కియరా అద్వాని ఆ సినిమా రిలీజ్ కు ముందే రాం చరణ్, బోయపాటి సినిమా ఛాన్స్ కొట్టేసింది. మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన బోయపాటి ఈ సినిమాను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రాం చరణ్ లుక్ కూడా అదిరిపోయేలా ఉంటుందట.


దీని కోసమే జిమ్ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు రాం చరణ్. ఇక చరణ్ కు ఏమాత్రం తగ్గకుండా వర్క్ అవుట్స్ చేస్తుంది హీరోయిన్ కియరా అద్వాని. ఓ రకంగా చరణ్ కు చెమటలు పట్టించేలా ఆమె వర్క్ అవుట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భరత్ భామ ఊపు చూస్తుంటే తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకునేలానే ఉందని అంటున్నారు.