
పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆర్జివి అనేది ఎప్పటినుండో నడుస్తున్న యుద్ధమని అందరికి తెలిసిందే. పవన్ తనపని తాను చేసుకుపోతున్నా వర్మ మాత్రం తన ఫోకస్ అంతా పవన్ మీదే ఉంచుతాడు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆర్జివి రీసెంట్ గా రవితేజ నేల టిక్కెట్టు ఆడియోలో రవితేజ టాన్ జీన్స్ గురించి అడిగి తెలుసుకున్న వైనాన్ని తప్పుబట్టాడు.
అయితే అది సరే అని అనుకున్నా తిరుమల కాలి నడకలో వెళ్తూ ఓ చోట రిలాక్స్ అవగా వర్మ మళ్లీ పవర్ స్టార్ పవన్ ఫుల్ ఎనర్జీకి ఇదే ఉదాహరణ అని ట్వీట్ వేశాడు. అయితే దీనికి స్పందించిన ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కెలకమాకు సామి అంటూ వర్మకు కౌంటర్ గా ట్వీట్ వేశాడు. ఇంతకీ శాస్త్రి గారు ఏమని ట్వీట్ చేశాడు అంటే.. కెలకమాకు సామి.. కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు. ఇది మీకు హుందా అయినది కాదు.తెలుగు ప్రజల సమయం అంత తేలిక కాదు. ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి అంటూ రాజోగయ్య శాస్త్రి గారు వర్మకు ట్వీట్ కౌంటర్ ఇచ్చారు. మరి వర్మ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.