వైజయంతి బ్యానర్లో ఎన్టీఆర్..?

మహానటి సినిమాతో బ్యానర్ రేంజ్ ఏంటో మళ్లీ అందరికి తెలిసేలా చేసిన వైజయంతి బ్యానర్ అధినేత అశ్వనిదత్ మళ్లీ రెగ్యులర్ గా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే మహేష్ 25వ సినిమా దిల్ రాజుతో పాటుగా భాగస్వామ్యం అవుతున్న అశ్వనిదత్ త్వరలోనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ఎనౌన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. అసలైతే మహానటి సినిమాలో సీనియర్ ఎన్.టి.ఆర్ రోల్ లో తారక్ ను నటింపచేయాలని గట్టి ప్రయత్నం చేశాడు అశ్వనిదత్.. కాని అందుకు తారక్ మాత్రం ససేమీరా అన్నాడు.

అందుకే అతనితో ఓ భరీ ప్రాజెక్ట్ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఈ నెల చివరిలోపు ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం తో సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ ఆ సినిమా తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ కూడా లైన్ లో ఉంది. మరి అశ్వనిదత్ సినిమా ఇప్పుడు ఓకే చేసినా అది సెట్స్ మీదకు వెళ్లేది మాత్రం 2019 లోనే అని తెలుస్తుంది.