
మహానటి సినిమా ఊహించని రేంజ్ లో వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అశ్వనిదత్ సమర్పణలో ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు నిర్మించడం జరిగింది. ప్రీమియర్స్ తోనే దాదాపు హాఫ్ మిలియన్ మార్క్ అందుకున్న ఈ సినిమా 5 రోజుల్లో 1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను క్రాస్ చేసింది. మహానటి దూకుడు చూస్తుంటే యూఎస్ లో 2 మిలియన్ డాలర్స్ తో సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.
స్టార్ సినిమా రేంజ్ కలక్షన్స్ తో సంచలనం సృష్టిస్తున్న మహానటి ఆమె మరణించి 40 ఏళ్లు దాటుతున్నా బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నారు. కీర్తి సురేష్ అద్భుత నటన, మిక్కి జే మేయర్ హృదయానికి హత్తుకునే సంగీతం సినిమాను మరో లెవ కు తీసుకెళ్లాయి. యూఎస్ బాక్సాఫీస్ పై మహానటి హంగామా ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు.