మహానటి శాటిలైట్ ఫైట్..!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా సంచలన విజయం అందుకుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు జీవించేశారని ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందు శాటిలైట్ వచ్చినా రిలీజ్ తర్వాత హిట్ అంచనా వేసిన దర్శ నిర్మాతలు ఇప్పుడు సినిమా శాటిలైట్ రైట్స్ కోసం భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారట. 

మహానటి శాటిలైట్ రైట్స్ కోసం జెమిని, జీ తెలుగు, స్టార్ మా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. సినిమా సూపర్ హిట్ కాబట్టి బుల్లితెర మీద కూడా ఈ మహానటికి భరీ క్రేజ్ వచ్చింది. అందుకోసం ఎంత మొత్తమైనా సరే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా అదరగొట్టాడు. సమంత, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ అందరు తమ పాత్రలకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు.