
రాజ్ తరుణ్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సంజనా రెడ్డి డైరెక్ట్ చేస్తున్న సినిమా రాజుగాడు. తనకు తెలియకుండానే దొంగతనం చేసే ఓ కుర్రాడు అది తెలుసుకుని బాధపడే తల్లిదండ్రులు. ఇంతలోనే కుర్రాడి మనసు గెలిచిన హీరోయిన్ ఇదంతా జరుగుతుంటే చిన్న తప్పుకే పెద్ద శిక్ష వేసే విలన్ ఇలా అందరిని ఒక చోటకి చేర్చి నడిపించే కథే రాజుగాడి కథ.
సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. రాజ్ తరుణ్ ఈజ్ తో నటించినట్టు కనిపిస్తున్న ఈ సినిమా లైన్ కొంత భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమా కథల్లా అనిపిస్తుంది. ఇక సినిమాలో కామెడీని హైలెట్ గా చేస్తూ వచ్చారు. ట్రైలర్ అయితే రొటీన్ గా ఉన్నా నాట్ బ్యాడ్ అనేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అమైరా దస్తర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.