మహానటి బాధ్యత పెంచిందిగా..!

బయోపిక్ లకు బాగా డిమాండ్ ఏర్పడిన ఈ టైంలో సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సూపర్ హిట్ అవడంతో ఈమధ్యనే ఎన్.టి.ఆర్ బయోపిక్ గా మొదలు పెట్టిన బాలకృష్ణ ఎన్.టి.ఆర్ సినిమాపై ప్రెజర్ పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే దర్శకుడు తేజ ఆ బయోపిక్ నుండి తప్పుకోగా దర్శకుడు ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు. మరో పక్క వైఎస్సార్ బయోపిక్ గా యాత్ర సినిమా కూడా వస్తుంది.

మహి వి రాఘవ్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మమ్ముట్టి వై.ఎస్.ఆర్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. మహానటి సినిమా విజయం ఈ సినిమాలకు ఉత్సాహంతో పాటుగా మరికొంత బాధ్యతను కూడా పెంచిందని చెప్పాలి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతోనే వస్తుంది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది. ఆ సినిమా మీద కూడా మహానటి ప్రభావం ఉండబోతుంది.