మహానటికి కేటిఆర్ ఫిదా..!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమ చూసిన ప్రేక్షకులు, సెలబ్రిటీస్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద వచ్చిన హైప్ చూసి సినిమా రిలీజ్ రోజునే ప్రత్యేకంగా టైం కేటాయించుకుని చూశారు తెలంగాణా ఐటి, పంచాయితిరాజ్ శాఖా మంత్రి కే.టి.ఆర్. 24 గంటలు బిజీగా ఉండే ఆయన సినిమా కోసం 3 గంటలు టైం కేటాయించేందుకు ఇష్టపడతారు.

రీసెంట్ గా భరత్ అనే నేను స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని చూసిన కే.టి.ఆర్ ఇప్పుడు మహానటి సినిమాను చూడటం జరిగింది. చూడటమే కాదు మహానటికి ఆయన ఫిదా అయ్యారని తెలుస్తుంది. సినిమా చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేశారని.. ఆమె నటన అద్భుతమని అన్నారు. ఇక ఇంత గొప్ప సినిమా తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతలు స్వప్నా దత్, సినిమాలో సమంత, నాగ చైతన్య, దుల్కర్, విజయ్ దేవరకొండలు అద్భుతంగా నటించారని ట్వీట్ చేశారు.