
రంగస్థలం హిట్ తో మంచి జోష్ మీద ఉన్న రాం చరణ్ కు బోయపాటి శ్రీను సినిమా ముందు నుండి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. సినిమా మొదలు పెట్టినా సరే రెండు షెడ్యూల్స్ దాకా హీరో లేకుండానే షూటింగ్ చేశారు. ఇక ఈమధ్యనే 3వ షెడ్యూల్ స్టార్ట్ అవగా షూట్ చేసిన యాక్షన్ పార్ట్ అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదట. అందుకే ఆ ఎపిసోడ్ మళ్లీ రీ షూట్ చేయాలని అనుకున్నారట.
ఈలోగా సినిమా బ్యాంకాక్ లో షూట్ చేయాల్సిందిగా డేట్స్ ఫిక్స్ చేశారట. అక్కడ 15 రోజుల పాటు షూటింగ్ ఉంటుదని తెలుస్తుంది. అది పూర్తి చేసుకుని వచ్చాక మళ్లీ ఈ యాక్షన్ సీన్స్ రీ షూట్ చేస్తారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బోయపాటి శ్రీనుతో మొదటిసారి కలిసి సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ డిస్టబెన్సెస్ ఎందుకు వస్తున్నాయో చూసుకుంటే బెటర్ లేదంటే సినిమా మీద నెగటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది.