మహానటికి ప్రముఖుల ప్రశంసలు..!

సావిత్రి జీవిత గాథను మహానటిగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ సినిమా తీయాలన్న గట్స్ ప్రూవ్ చేసుకున్న అశ్వనిదత్ అండ్ తన కూతుళ్లకు సిని ప్రముఖుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. సినిమా ఊహించిన విధంగానే అంచనాలకు తగినట్టుగా ఇంకా చెప్పాలంటే దానికి మించి అవుట్ పుట్ వచ్చిదని చెప్పొచ్చు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు బరువెక్కిన హృదయాలతో వెళ్తున్నాడు.

దర్శకుడు నాగ్ అశ్విన్ జీవిత కథను తీసుకున్న విధానం.. కీర్తి సురేష్ అభినయం మిగతా స్టార్ పర్ఫార్మెన్స్ అంతా సినిమాను గొప్ప స్థాయిలో నిలబెట్టాయి. ఇక ఈ సినిమా చూసిన దర్శకధీరుడు రాజమౌళి తన రెస్పాన్స్ అందించాడు. సావిత్రి పాత్రలో కీర్తి నటించిన తీరు అద్భుతమని.. ఇలాంటి ప్రదర్శన తాను ఇప్పటివరకు చూడలేదని అన్నారు. ఇది ఇమిటేట్ చేయడం కాదు ఆ లెజెండరీ నటికి జీవం పోశారు. దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. ఇప్పటి నుండి నేను అతనికి ఫ్యాన్ అయానని ట్వీట్ చేశారు రాజమౌళి.

ఇక సరిగ్గా 28 ఏళ్ల క్రితం దత్తు గారికి ఎంత ఆనందం కలిగిందో.. ఇప్పుడు అదే రోజున రిలీజ్ అయిన మహానటి సినిమాకు అంతే ఆనందం ఇస్తుందని అన్నారు. 28 ఏళ్ల క్రితం జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయ్యింది. రిలీజ్ నాడు భారీ వర్షం ఉన్నా సాయంత్రానికి సినిమా హిట్ అని తెలిసిందని ఆ రోజుని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్ర రావు.