కొరటాలకు సిఎం గిఫ్ట్ ..!

మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచిన ఈ సినిమా మహేష్ కు నూతనోత్సాన్ని ఇచ్చింది. శ్రీమంతుడు టైంలో మహేష్ తనకు ఇచ్చిన హిట్ కు కానుకగా కొరటాల శివకు ఆడి కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. మిర్చి తర్వాత సెకండ్ మూవీనే శ్రీమంతుడు సినిమా చేయడం అది కాస్త అంత పెద్ద హిట్ అవడం జరిగింది.


ఇక ఇప్పుడు భరత్ అనే నేను సినిమాకు కూడా భారీ వసూళ్లతో మహేష్ కెరియర్ లో మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా హిట్ అయిన కారణం చేత కూడా మహేష్ కొరటాల శివకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడట. శ్రీమంతుడు తర్వాత కారుని కానుకగా ఇవ్వగా ఇప్పుడు ఏకంగా ఓ విల్లానే కొనిచ్చేశాడట మహేష్. సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ సూపర్ స్టార్ కు 4 ఇయర్స్ లో 2 లైఫులిచ్చిన దర్శకుడు అని కొరటాల శివను పొగడ్తలలో ముంచెత్తాడు మహేష్.