ఎన్టీఆర్ 'అసమాన్యుడు'..!

జై లవ కుశ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో మొదటిసారి త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. అసలైతే ఈ కాంబినేషన్ ఎప్పుడో సినిమా చేయాల్సి ఉన్నా అది ఇప్పటికి కుదిరింది. మాటల తూటాలతో మనసుకి హత్తుకునేలా కథ కథనాలను నడిపించే దర్శకుడు త్రివిక్రం అలాంటి డైరక్టర్ కు యంగ్ టైగర్ లాంటి నటుడు దొరికితే ఎలా ఉంటుంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా అసమాన్యుడు అని పెట్టబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. అయితే ఇంతకుముందు కూడా త్రివిక్రం, ఎన్.టి.ఆర్ మూవీ టైటిల్స్ గురించి రూమర్స్ వచ్చాయి. మరి ఈ అసమాన్యుడు అయినా కన్ఫామా కాదా అన్నది చూడాలి.