రాం చరణ్ కోసం కేథరిన్..!

రంగస్థలం హిట్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రాజవంసస్థుడు, రాజమార్తాండా టైటిల్స్ వినిపిస్తున్న ఈ సినిమా బోయపాటి మార్క్ తో రాబోతుందని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను బ్యూటీ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. 

ఇక ఈ సినిమాలో మరో క్రేజీ బ్యూటీ కేథరిన్ కు ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఇద్దరమ్మాయిలతో సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన కేథరిన్ ఆ తర్వాత అల్లు అర్జున్ తోనే రెండు మూడు సినిమాల్లో కనిపించింది. తెలుగులో సోలో హీరోయిన్ గా కన్నా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నారని తమిళ పరిశ్రమకు జంప్ అయ్యింది కేథరిన్ ఇక ఇప్పుడు రాం చరణ్ సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ తో పాటుగా ఓ సాంగ్ లో కూడా అమ్మడు కనిపిస్తుందట. మరి కేథరిన్ చరణ్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.