మహేష్ తోనే 'జనగణమన'.. హౌ పూరి హౌ..!

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను తర్వాత తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లితో ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ తో సినిమా కూడా కన్ ఫాం చేసుకున్నాడు. ఈ రెండిటి తర్వాత అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ షుగర్ ఫ్యాక్టరీ సినిమా వైపు కూడా మహేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రాజమౌళి సినిమా ఉండనే ఉంది.

ఇవన్ని ఉన్నా పూరి మాత్రం తను రాసుకున్న జనగణమన సినిమా మహేష్ తోనే తీస్తా అని అన్నాడు. మహేష్ తో పూరి చేసిన పోకిరి ఇండస్ట్రీ హిట్ అవగా బిజినెస్ మెన్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం పూరి ఫ్లాపుల్లో ఉన్నా మెహబూబాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఓ పక్క మహేష్ తో దర్శకనిర్మాతలు సినిమా కోసం పోటీ పడుతుంటే పూరి మాత్రం మహేష్ తోనే జనగణమన ఉంటుందని అనడ హౌ ఇట్స్ పాజిబుల్ అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 

ఇక మన దేశ చట్టాల గురించి కూడా ఆ సినిమాలో ఉంటుందని. నిర్భయ, ఆసిఫా ఘటనలు మన దేశంలో జరిగాయి అలాంటి సంఘటనలు వేరే దేశంలో జరిగితే తలలు తీసేస్తారని అన్నాడు పూరి. మరి చూస్తుంటే జనగణమన కంటెంట్ పరంగా పూరి బాగానే వర్క్ అవుట్ చేసినట్టు కనిపిస్తుంది.