
మహానటి సావిత్రి జీవిత కథతో వస్తున్న సినిమా మహానటి. టైటిల్ రోల్ ను మలయాళ భామ కీర్తి సురేష్ నటిస్తుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మిస్తున్నారు. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొదట్లో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ఎంపికను అందరు తప్పు పట్టారు. కాని ఇప్పుడు ఆ సినిమా టీజర్, ట్రైలర్ చూశాక సూపర్ అనేస్తున్నారు.
ఈ సినిమా కోసం కీర్తి సురేష్ కూడా చాలా కష్టపడ్డదని తెలుస్తుంది. సినిమా కోసం కీర్తి సురేష్ కు కోటిన్నర దాకా ఆఫర్ చేశారట నిర్మాతలు. సమంత తర్వాత రకుల్, అనుష్క ఇలా స్టార్స్ అందుకునే ఈ క్రేజీ రెమ్యునరేషన్ లిస్టులో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా చేరింది. మరి మహానటిగా కీర్తి సురేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.