
నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ ఇద్దరి మధ్య దూరం పెరిగిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కళ్యాణ్ రాం నటించిన ఎం.ఎల్.ఏ, నా నువ్వే సినిమాల ప్రమోషన్స్ కు ఎన్.టి.ఆర్ ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. ఇక ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి కళ్యాణ్ రాం కు పిలుపు రావడం కనీసం ఎన్.టి.ఆర్ కు ఆరంభ ఇన్విటేషన్ కూడా బాలకృష్ణ పంపించకపోవడం కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ ల మధ్య చిచ్చు రేపిందట.
ఎన్.టి.ఆర్ బయోపిక్ నుండి ఆహ్వానాన్ని అందుకున్న కళ్యాణ్ రాం ఆ సినిమా ప్రారంభం రోజే కాదు సినిమాలో కూడా నటిస్తున్నాడని అన్నారు. ఇక మరో పక్క మహానటి సినిమాలో ఎన్.టి.ఆర్ రోల్ చేయమని అవకాశం వచ్చినా ఎన్.టి.ఆర్ వద్దనేశాడు. ఈ రెండు బయోపిక్ లే ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ల మధ్య దూరం పెంచాయని చెబుతున్నారు. అయితే కళ్యాణ్ రాం కె.వి.గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ముహుర్తంలో ఎన్.టి.ఆర్ అటెండ్ అయ్యాడు. మరి ఈ నందమూరి బ్రదర్స్ మధ్య గొడవ నిజమా కాదా అన్నది మరి కొద్దిరోజుల్లో తెలుస్తుంది.