డైరెక్టర్ క్రిష్ కి ఎంగేజ్మెంట్ జరిగింది

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్ పెద్ద సక్సెస్ అవడం, సినీ 'మా' అవార్డ్స్ లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు అవార్డులు తన సినిమా కంచె సొంతం చేసుకోవడంతో, ఎటు చూసినా డైరెక్టర్ క్రిష్ కి శుభ శకునాలే. ఇదే సందు గా చేస్కుని కొద్దీ రోజుల క్రితమే హైద్రాబాద్ లో డాక్టర్ వృత్తి లో ఉన్న రమ్య ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు క్రిష్. ఎప్పుడో ఆగస్టులో జరగబోతున్న ఈ పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇప్పుడు జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో, అత్యంత దగ్గరి వాళ్ళతో ఈ ఫంక్షన్ జరిగింది, ఇండస్ట్రీ నుండి తన తదుపరి సినిమా హీరో బాలకృష్ణ, ఫంక్షన్ లో తళుక్కుమన్నారు. 

ఎంగేజ్మెంట్ దగ్గరి వాళ్ళతో జరుపుకున్నా, పెళ్లి మాత్రం అత్యంత వైభవంగా, తెలుగు సినిమా, హిందీ సినిమా తారల నడుమ జరుపుకోబోతున్నట్లు సమాచారం. నగరంలోని పెద్ద హోటల్ లో ఇప్పటికే పెళ్లి కి సంబంధించి హాల్ బుక్ చేసినట్లు తెలుస్తోంది.