బిగ్ బాస్ కు మీరు వెళ్తారా..!

స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్మిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు అన్ని రీజనల్ లాంగ్వెజెస్ లో వస్తుంది. బాలీవుడ్ లో మొదలైన ఈ రియాలిటీ షో తెలుగులో కూడా మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్-2కి సంబందించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ నుండి బిగ్ బాస్ సెకండ్ సీజన్ మొదలవుతుందని అంటున్నారు.

ఇక ఈ సీజన్ లో సర్ ప్రైజ్ ఏంటంటే సెలబ్రిటీ కంటెస్టంట్స్ తో పాటుగా ఆడియెన్స్ కు అవకాశం ఇస్తున్నారట. అందుకు సంబందించిన ట్యుటోరియల్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఆడిషన్ లో సెలెక్ట్ అయిన కామనర్స్ కు కొంత ట్రైనింగ్ ఇచ్చి ఈ షోలో పాటిస్పేట్ చేసేలా చూస్తున్నారట. సెలబ్రిటీస్ తో ప్రేక్షకుల బిగ్ బాస్ ఆట భలే గమ్మత్తుగా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే హింది బిగ్ బాస్ లో ఈ తరహా ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు. అందుకే తెలుగులో కూడా అలాంటి ప్రయత్నం మొదలు పెడుతున్నారు.