వచ్చాడయ్యో సామి..!

టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ఎట్టకేలకు బయటకు వచ్చారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణలో ఆయన కనిపించారు. ఫిల్మ్ చాంబర్ ఆవరణలో దాసరి విగ్రహాన్ని ఉంచారు. అంతేకాదు మే 4న దాసరి జయంతిని డైరక్టర్స్ డే గా ప్రతిపాదించారు దర్శకుల శాఖ. ఇక ఈ కార్యక్రమంలో కొన్నాళ్లుగా మీడియా ముందుకు వచ్చేందుకు వెనుకడుగేస్తున్న దగ్గుబాటి సురేష్ బాబు బయటకు వచ్చారు.

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేసిన రచ్చ అందరికి తెలిసిందే. అందులో సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం పేరు బాగా వినిపించింది. శ్రీరెడ్డి ఏకంగా అభిరాం ఫోటోలనే బయట పెట్టేసింది. అప్పటి నుండి మీడియా ముందుకొచ్చేందుకు నిరాకరించిన సురేష్ బాబు ఫైనల్ గా దాసరి విగ్రహావిష్కరణలో కనిపించారు. అయితే మీడియా కూడా జరుగుతున్న ప్రోగ్రాం ఒకటి కాబట్టి శ్రీరెడ్డి ఇష్యూని లేవనెత్తలేదు.