అఖిల్ కోసం కొరటాల సిద్ధం..!

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను అందించలేదు. ప్రస్తుతం 3వ సినిమాగా తొలిప్రేమతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఇక ఆ సినిమా తర్వాత తనయుడి కెరియర్ మీద ఫోకస్ పెట్టిన నాగార్జున సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

రైటర్ నుండి డైరక్టర్ గా మారిన కొరటాల శివ మిర్చి నుండి నిన్న వచ్చిన భరత్ అనే నేను సినిమా వరకు సూపర్ హిట్లు అందుకుంటున్నాడు. భరత్ తర్వాత బన్నితో సినిమా అని వార్తలొచ్చినా వాటిల్లో నిజం లేదని తెలుస్తుంది. ఇక నాగార్జున కోరిక మేరకు అఖిల్ తో కొరటాల శివ సినిమా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమా ఉంటుందట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయట.