రామ్ కు విలనైన రాజశేఖర్..!

నేను శైలజతో హిట్ అందుకున్న రామ్ ఆ తర్వాత హైపర్, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో మళ్లీ వెనకపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. యాంగ్రీ యంగ్ మన్ డాక్టర్ రాజశేఖర్ తో రీసెంట్ గా గరుడవేగతో హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 

ఇక ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తున్నాడు ప్రవీణ్. ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేయబోతున్నాడని తెలుస్తుంది. గరుడవేగతో సక్సెస్ అందుకున్న రాజశేఖర్ విలన్ గా న్యూ టర్న్ తీసుకుంటున్నాడు. రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ కు విలన్ గా అదే ఎనర్జీ ఉన్న  రాజశేఖర్ విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది.