
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న నా పేరు సూర్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాంగ్రీ సోల్జర్ గా బన్ని సరికొత్త మేకోవర్ తో సినిమాలో కనిపిస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలనే క్రియేట్ చేయగా ఇప్పుడు ఆ క్రేజ్ మరింత పెంచేలా బన్ని మెగా స్కెచ్ వేశాడని తెలుస్తుంది.
ఈమధ్య పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద మెగా ఫ్యామిలీతో పాటుగా అల్లు అరవింద్ నెగటివ్ కామెంట్స్ చేశాడు. ఇది ఎక్కడ దృష్టిలో ఉంచుకుని సినిమా ప్రమోట్ చేయడం మానేస్తారేమో అని మీడియాకు ఓ మంచి పార్టీ ఎరేంజ్ చేశాడట అల్లు అర్జున్. ముఖ్యంగా రివ్యూస్ రాసే వారికి ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. బన్ని ఇచ్చే మీడియా పార్టీలో కూడా ఎవరెవరికి ఇన్విటేషన్ పంపాలి వద్దు అని కూడా డిస్కషన్స్ జరిపారట. మరి ఈ మీడియా పార్టీ జరిగిన ఇష్యూని సినిమా ఫలితం మీద ఎఫెక్ట్ కానివ్వకుండా చూసేలా బన్ని ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.