రంగస్థలం @ 200 కోట్లు..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నిటిని బ్రేక్ చేసింది. ధ్రువ తర్వాత రాం చరణ్ నటించిన ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ అద్భుత నటనకు ప్రేక్షకులు నీరాజనాలు అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

రిలీజ్ అయిన నాటి నుండి సంచలనాలు సృష్టించిన రంగస్థలం నెల రోజులు ముగిసే సరికి 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసింది. అంచనాలను అందుకోవడమే కాదు మగధీర తర్వాత రాం చరణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా రంగస్థలం. ఇక సుకుమార్ కెరియర్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఓ పక్క భరత్ అనే నేను హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ సినిమా రంగస్థలం మీద ఎలాంటి ప్రభావం చూపలేదు.