
విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్.టి.ఆర్ సినిమా అంగరంగ వైభవంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తేజ డైరక్షన్ లో మొదలైన ఈ సినిమా దసరా కల్లా రిలీజ్ చేయాలని అనుకున్నారు. సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజ్లకే తేజ ఈ సినిమా నా వల్ల కాదని చేతులెత్తేశాడు.
తేజాని కన్విన్స్ చేయాలని చూసిన లాభం లేకపోవడంతో ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ దర్శకుల వేటలో పడ్డారు. ఈ సినిమా చేయడం తేజా వల్ల ఎందుకు కాలేదన్న యాంగిల్ లో ఆరా తీస్తే చాలా విషయాలే బయటకు వచ్చాయి. అయితే ఏది వాస్తవం అన్నది తెలియదు. అది పక్కన పెడితే క్రిష్, రాఘవేంద్ర రావు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయోపిక్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందట.
రాఘవేంద్ర రావు మాత్రం ప్రాజెక్టునే ఆపేయమని సలహా ఇచ్చాడట. ఇక క్రిష్ మాత్రం అవునని కాని కాదని కాని చెప్పలేదట. మరి క్రిష్ ఓకే చేసినా చేయకున్నా సరే బాలకృష్ణ తానైనా డైరెక్ట్ చేస్తా అని కూర్చున్నాడట. మరి ఎన్.టి.ఆర్ బయోపిక్ ఏమవుతుందో చూడాలి.