
తెలుగు సినిమా చరిత్రతో చిరస్థాయిగా నిలచిన దర్శకుడు దారి నారాయణ రావు. దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలు అన్ని ఇన్ని కావు దర్శకుడు అని చెప్పుకునేందుకు గర్వపడేలా చేసిన ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన జయంతిని డైరక్టర్స్ డే గా తెలుగు దర్శకుల సంఘం ప్రకటించింది. తెలుగు పరిశ్రమకు ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేసిన దాసరి జయంతిని ఈసారి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనున్నారు.
మే 4న ఆయనకు నివాళి అర్పిస్తూ ఫిల్మ్ చాంబర్ లో ఓ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రముఖ దర్శకులంతా ఈ కార్యక్రమానికి హాజరవనున్నారని తెలుస్తుంది. ఇక అదేరోజున దాసరి విగ్రహాన్ని చాంబర్ ఆవరణలో ప్రతిష్టించనున్నారు. ఇక టి.ఎస్.ఆర్-వంశీ ఆర్ట్స్ సమక్షంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ కు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు.