స్టార్ హీరో సినిమాపై కుట్ర..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య మూవీ మే 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో యాంగ్రీ సోల్జర్ గా బన్ని కనిపిస్తున్నాడు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరుగగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సినిమాపై కుట్ర జరుగుతుందనే మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. నా పేరు శివ సినిమా మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దామని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని. మెగా అభిమానులు వాటిని పట్టించుకోకుండా ఉండాలని అన్నారు. అయినా సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారంటూ ఓ రకంగా పవన్ ఛానెల్స్ కు మధ్య జరిగిన రగడ గురించి ప్రస్థావించాడు అల్లు అరవింద్. 

అయినా మీడియా చూపనంత మాత్రాన హిట్ సినిమా ఫ్లాప్ అవుతుందా ఫ్లాప్ సినిమా హిట్ అవుతుందా అదంతా సినిమా మొదటి రోజు షో పడే వరకే. వన్స్ షో పడి టాక్ బాగుంది అని వస్తే ఆ సినిమాను ఎవరు ఆపలేరు.