రంగస్థలం మెచ్చిన నారా లోకేష్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా రంగస్థలం. సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సరిగా నెల అవుతుంది. రాం చరణ్ కెరియర్ లో మగధీర టాప్ ప్లేస్ లో ఉండగా ఈ సినిమా ఆ వసూళ్లను కూడా మించి కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్నాళ్లకు ఏపి ఇటీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ సినిమాపై స్పందించడం జరిగింది.

తెలుగు వారికి రంగస్థలం లాంటి సినిమా అందించినందుకు దర్శకుడు సుకుమార్ కు, హీరో రాం చరణ్ కు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశాడు నారా లోకేష్. అంతేకాదు సినిమా అయిపోయినా ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉంటాయంటూ గ్రేట్ వర్క్ గాయ్స్ అంటూ మెచ్చుకున్నాడు. నారా లోకేష్ ట్వీట్ కు మెగా పవర్ స్టార్ రాం చరణ్ థ్యాంక్యూ లోకేష్ గారు అంటూ రిప్లై ఇచ్చాడు.