
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతున్న సినిమా నా పేరు సూర్య. టీజర్ ఇంపాక్ట్ తోనే సినిమాపై అంచనాలను పెంచేసిన బన్ని ఇక ఈరోజు వచ్చిన ట్రైలర్ తో మరింత భారీతనం తెచ్చాడు. యాంగ్రీ సోల్జర్ గా తనకు ఎవరు ఎదురొచ్చినా తుక్కురేగ్గొట్టేలా సూర్య పాత్ర కనిపిస్తుంది. ఇక ఆ పాత్ర కోసం బన్ని చేసిన హార్డ్ వర్క్ మెచ్చుకోదగినదే.
విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ తో మరింత అంచనాలను పెంచేసిన బన్ని చూస్తుంటే ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తాడని అనిపిస్తుంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ బాబు, బన్ని వాసు సహ నిర్మాతలుగా ఉంటున్నారు. మే 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఫలితంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.