రీల్ లీడర్.. రియల్ లీడర్.. అదరగొట్టారు..!

మహేష్ భరత్ అనే నేను సినిమా రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు కూడా ఓ కనువిప్పు కలిగేలా చేశారు. అంతేకాదు సమస్య సమసిపోవాలంటే కేవలం రాజకీయ నాయకులే కాదు ముందు మనం ఏం చేయాలన్నది చూపించారు. ఈ సినిమా చూసిన తెలంగాణా ఐటి, పంచాయితి రాజ్ శాఖ మంత్రి కె.టి.ఆర్ స్పెషల్ గా విజన్ ఫర్ ఏ బెటర్ టుమారో అంటూ ఓ ఇంటరాక్షన్ ప్రోగ్రాం కండెక్ట్ చేశారు.

కె.టి.ఆర్, భరత్ అనే నేను దర్శకుడు కొరటాల శివతో పాటుగా మహేష్ ఇందులో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటరాక్షన్ లో కొందరు స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు మంత్రి కె.టి.ఆర్ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. సినిమాలో చూపించినంత స్పీడ్ గా పనులు జరుగకున్నా రాజకీయ నాయకుడిగా తాము చేయాల్సి చేస్తాం అన్నారు. 

భరత్ సినిమా కోసం కె.టి.ఆర్ ఇలా స్పెషల్ ఇంటరాక్షన్ చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. రీల్ లీడర్ తో రియల్ లీడర్ చాటింగ్ సరదాగా అనిపించింది. మహేష్ ఫ్యామిలీ లైఫ్ కు ఇస్తున్న ఇంపార్టెంట్ చూసి కె.టి.ఆర్ తన ఫ్యామిలీలో కూడా అలా అడుగుతున్నారని కామెడీ చేశారు. ఫైనల్ గా రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రాం మొత్తం వీడియోని రీసెంట్ గా బయటకు రిలీజ్ చేశారు.  

విజన్ ఫర్ బెటర్ టుమారో కె.టి.ఆర్, మహేష్ ఇంటరాక్షన్ ఫుల్ వీడియో కింద ఉంచబడినది..