మేడం టుస్సాడ్స్ లో మహేష్..!

మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో మహేష్ బాబు కూడా స్థానం సంపాదించుకున్నడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మైనపు బొమ్మని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచడం జరిగింది. బ్యాంకాక్ లో ఉన్న మ్యూజియం లో ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టారు. ఇక ఆ తర్వత సౌత్ ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ రజినికాంత్ మైనపు బొమ్మని అక్కడ ఉంచడం జరిగింది.

ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ మహేష్ కు వచ్చింది. సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు మహేష్ మైనపు బొమ్మను ఉంచేందుకు వచ్చారు. దీనికి సంబందించిన కొలతలను కూడా తీసుకెళ్లడం జరిగింది. ఓవర్సీస్ లో మహేష్ హంగామా అంటే అందరికి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఫారిన్ లో ఎక్కువగా మహేష్ సినిమాలు చూసేందుకే ఇష్టపడతారు ఆ క్రేజ్ ను చూసి మేడం టుస్సాడ్స్ నుండి మహేష్ కు పిలుపు వచ్చింది.  

రీసెంట్ గా భరత్ అనే నేను సినిమాతో కెరియర్ లో మరో సూపర్ హిట్ సాధించాడు మహేష్ బాబు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం జరిగింది.