
మిర్చి నుండి భరత్ అనే నేను వరకు డైరక్టర్ గా సూపర్ సక్సెస్ అయిన కొరటాల శివ అంతకుముందు రైటర్ గా కూడా మంచి హిట్లు కొట్టాడు. లేటెస్ట్ గా వచ్చిన భరత్ అనే నేను సినిమా అయితే మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచేలా పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తన తర్వాత సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల శివ.
ఇక ఇదే కాకుండా తన దగ్గరకు మంచి కథతో వస్తే తాను సినిమా నిర్మించేందుకు కూడా సిద్ధమే అంటున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం పరిశ్రమలో యువరక్తం అవసరమని వారిని ప్రోత్సహించే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే కొరటాల శివ కూడా నిర్మాతగా మారేందుకు తాను సిద్ధమే అని తనని మెప్పించే కథ దొరికితే తాను ఎప్పుడైనా రెడీ అంటున్నాడు. సో త్వరలోనే కొరటాల శివ కొత్త టర్న్ తీసుకోనున్నాడని చెప్పొచ్చు.