కాలా శాటిలైట్ రైట్స్.. అదిరిపోయే రేటు..!

కబాలి తర్వాత పా. రంజిత్ సూపర్ స్టార్ రజినికాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాలా. రజినికాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అసలైతే ఏప్రిల్ 27న రిలీజ్ అనుకున్న ఈ సినిమా జూన్ 7కి వాయిదా వేశారు. రిలీజ్ పోస్ట్ పోన్ కు కారణాలు ఎలా ఉన్నా సినిమా మీద అంచనాలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మాఫియా డాన్ గా కనిపిస్తున్న రజిని కాలా సినిమా అన్ని భాషల్లో కలిపి 75 కోట్ల శాటిలైట్ రేటు వచ్చింది.

స్టార్ మా తెలుగు, తమిళ, హింది భాషల్లో కలిపి ఈ రేటుకి కాలా రైట్స్ కొనేశారట. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 200 కోట్ల దాకా జరిగిందని అంటున్నారు. కబాలి సినిమాతో రంజిత్ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా రజిని ఫ్యాన్స్ ను అలరించేలా తీశారని అంటున్నారు. టీజర్ తో కబాలి సంచలనంగా మారి తమిళంలో హిట్ అయినా మిగతా చోట్ల అంతగా ఆడలేదు. మరి ఈ కాలా అయినా అన్నిచోట్ల సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.