బన్నితోనే భరత్ దర్శకుడు..!

రైటర్ గా సూపర్ సక్సెస్ లను అందుకున్న కొరటాల దర్శకుడిగా మారాక మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. మిర్చి నుండి రీసెంట్ గా వచ్చిన భరత్ అనే నేను వరకు కొరటాల శివ సినిమా అంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క. శ్రీమంతుడు తర్వాత మహేష్ తో చేసిన భరత్ అనే నేను బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎవరితో చేస్తాడు అన్న విషయం మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో సినిమా ఉన్నా అది లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం మరో వారం లో సినిమా రిలీజ్ చేసి ఖాళీ అవుతున్న స్టైలిష్ స్టార్ మీద కొరటాల శివ కన్ను పడింది. మెగా హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని నా పేరు సూర్యతో మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతోనే సినిమా చేస్తాడని టాక్. మరి ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.