రామ్ గోపాల్ వర్మ స్టయిల్ లో సాయి ధరమ్ తేజ్ తిక్క క్లయిమాక్స్

యువ మెగా హీరోల్లో ఫుల్ ఊపులో ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతుండడం వల్ల, కమర్శియల్ హీరో గానే సెటిల్ అవుదామని ఉద్దేశంతో, మరో మాస్ ఎంటెర్టైనర్ తిక్కతో ధరమ్ తేజ్ వస్తున్నారు. 

సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రధానంగా 'సి' సెంటర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నదే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి బయటికి పెద్దగా ఏమీ తెలియలేదు. అయితే ఇటీవల దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ, తిక్క క్లయిమాక్స్ చూశాక, మనీ, అనగనగా ఒక రోజు లాంటి రామ్ గోపాల్ వర్మ సినిమాలు గుర్తొస్తాయి అని చెప్పుకొచ్చారు. ట్రైలర్ తొందర్లోనే విడుదల చేస్తామని చెబుతూ, సినిమాని దసరాకి విడుదల చేస్తామని తెలిపారు. లారిస్సా బొనెసి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నారు. 'హేండిల్ విత్ కేర్' అనేది ఉపశీర్షిక.