RRR కు రచయిత ఆయన కాదా..!

రాజమౌళి సినిమా అంటే మ్యూజిక్ రాజమౌళి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ రెండు కచ్చితంగా ఉండాల్సిందే. బాహుబలి లాంటి సినిమా కూడా విజయేంద్ర ప్రసాద్ కలం నుండి వచ్చిన కథలే. అయితే ఈసారి విజయేంద్ర ప్రసాద్ కథను కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడట రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో రాజమౌళి చేయబోయే మల్టీస్టారర్ కథను గుణ్ణం గంగరాజు దగ్గర నుండి తీసుకున్నారట.

స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. 1980 ఒలంపిక్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. రాజమౌళి అండ్ టీం గుణ్ణం గంగరాజు దగ్గర ఈ కథను తీసుకుని డెవలప్ చేయడం మొదలు పెట్టారట. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ బాక్సర్ గా కనిపిస్తుండగా.. రాం చరణ్ హార్స్ రైడర్ గా కనిపిస్తాడట. మరి మొదటిసారి కెరియర్ లో తండ్రి కథ కాకుండా బయటకు వెళ్తున్న రాజమౌళికి సినిమా ఫలితం మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో చూడాలి.