
ఆర్య తర్వాత సుకుమార్ రేంజ్ సక్సెస్ అందుకున్న హిట్ బొమ్మ రంగస్థలం. తన్ లాంటి క్లాస్ డైరక్టర్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు సుకుమార్. స్టార్ సినిమా అది కూడా పర్ఫెక్ట్ మేకింగ్ తో వస్తే వసూళ్ల జాతరే అని రంగస్థలం ద్వారా ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా చూపించాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్.
ఇక ఈ సినిమా చూసిన తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ తోనే తన తర్వాత సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. సుకుమార్ కూడా బన్నితోనే చేయాలని చూస్తున్నాడట. అయితే బన్ని కూడా రంగస్థలం లాంటి సినిమా కథే కావాలని అడుగుతున్నాడట. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్న బన్ని త్వరలోనే తన తర్వాత సినిమా ఏంటన్నది ప్రకటిస్తారని తెలుస్తుంది.