తొలిప్రేమ తర్వాత రంగస్థలమే.. చరణ్ ను పొగడ్తల్లో ముంచెత్తిన బాబాయ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. వసూళ్లలో నాన్ బాహుబలి రికార్డులన్ని తిరగరాసిన రంగస్థలం సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడటం జరిగింది. బాబాయ్ కోసం రాం చరణ్ దగ్గరుండి ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకున్నాడు.

తొలిప్రేమ తర్వాత తనకు థియేటర్ లో చూడాలనిపించిన సినిమా రంగస్థలం అని అన్నాడు పవన్ కళ్యాణ్. సుకుమార్ వాస్తవికతను చాలా చక్కగా చూపించారని. చరణ్ అద్భుతంగా నటించాడని అన్నారు. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు నిర్మాతలకు తన కృతజ్ఞత తెలిపాడు. ఈమధ్య సినిమా ఈవెంట్ లకు దూరంగా ఉంటున్న పవన్ రంగస్థలం గురించి మాట్లాడటం ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక కొద్దిమాటలతోనే పూర్తి చేసి మిగతాది రంగస్థలం సక్సెస్ మీట్ లో మాట్లాడుతా అని వెళ్లిపోయారు.