సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మహేష్ ఉంటాడన్న వార్త మొన్నామధ్య సెన్సేషన్ అయ్యింది. తేజ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ ఈమధ్యనే అట్టహాసంగా మొదలైంది. ఇక ఈ సినిమాలో మహేష్ కూడా నటిస్తున్నట్టు టాక్. ఇంతకీ మహేష్ ఏ పాత్రలో కనిపిస్తున్నాడు అంటే సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో అని అంటున్నారు. ఎన్.టి.ఆర్, కృష్ణ కలిసి సినిమాలు కూడా చేశారు.

అందుకే కృష్ణ ప్రస్థావన కూడా ఎన్.టి.ఆర్ సినిమాలో ఉంటుందట. తండ్రి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఒకానొక దశలో ఎన్.టి.ఆర్, కృష్ణకు కాస్త దూరం ఏర్పడింది. మరి ఆ సన్నివేశాలు సినిమాలో ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను సినిమా రిలీజ్ కు సిద్ధమైంది.