ఆఫీసర్ టీజర్.. వర్మ మార్క్..!

శివ సినిమాతో ఆర్జివిని డైరక్టర్ గా గుర్తించి ఇండస్ట్రీకి పరిచయం చేసిన కింగ్ నాగార్జున ఆ సినిమాతో ట్రెండ్ సృష్టించారు. ఇక ఆ తర్వాత గోవింద గోవింద సినిమా కూడా చేశారు. సరిగ్గా మళ్లీ 25 ఏళ్ల తర్వాత నాగార్జున, వర్మ కలిసి సినిమా చేస్తున్నారు. వర్మ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టైటిల్ ఆఫీసర్ అని పెట్టారు. సినిమాలో నాగ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తున్నాడు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో వర్మ్ మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నాగార్జున మాస్ లుక్ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. యాక్షన్ సీన్స్ లో తనదైన కొత్తదనం చూపించే వర్మ మళ్లీ శివ లాంటి ట్రెండ్ ఆఫీసర్ తో సృష్టిస్తాడని అంటున్నారు. మే 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.