మెగా క్యాంప్ లో మేఘా ఆకాష్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా లై సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముగ్గుగుమ్మ మేఘా ఆకాష్. మళ్లీ అదే హీరోతో ఛల్ మోహన్ రంగ సినిమాలో కలిసి నటించి మెప్పించింది. ఛల్ మోహన్ రంగ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఊహించిన రేంజ్ లో లేకున్నా కామెడీతో నడిపించేశారు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మేఘా సెలెక్ట్ అయ్యిందని టాక్. 

అయితే అదే కాకుండా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా మేగా ఆకాష్ ను ఫైనల్ చేశారట. మరి ఒక్కసారి మెగా క్యాంప్ లోకి అడుగు పెడితే ఆ హీరోలందరి దృష్టి పడినట్టే. లక్ తగిలి సినిమా హిట్ అయితే ఇక ఆమె మెగా హీరోలతోనే వరుస సినిమాలు చేస్తుంది. మొత్తనికి నితిన్ మొదటి సినిమాతో హిట్ ఇవ్వకపోయినా సెకండ్ మూవీ మాత్రం ఆమె కెరియర్ కు సపోర్ట్ గా నిలిచింది.