భరత్ ట్రైలర్.. సిఎం చెడుగుడు ఆడేయడం ఖాయం..!

శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. శ్రీమంతుడులో ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో వచ్చిన కొరటాల శివ ఈ సినిమాలో ఓ బాధ్యతయుతమైన పౌరుడు సిఎం అయితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. సిఎంగా మహేష్ అదరగొడతాడని తెలుస్తుంది. 

ఇక రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ చూస్తేనే ఇది పక్కా హిట్ బొమ్మ అని తెలుస్తుంది. కొరటాల శివ కాన్సెప్ట్.. మహేష్ నటన.. కియరా అద్వాని అందాలు.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇలా అన్ని సమపాళ్లలో ఉంటాయని తెలుస్తుంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి ఈ సినిమా వారి ఆకలి తీర్చేలా కనిపిస్తున్నా ఫలితం ఎలా ఉంటుందో రిలీజ్ అయితేనే కాని చెప్పలేం.