
తామెంత స్టార్లు అయినా సరే తమ మూలాలని మర్చిపోరని హీరోలు రీసెంట్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపడింది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నడు లేని విధంగా ఓ స్టార్ హీరో ఈవెంట్ కు మరో స్టార్ హీరో వచ్చాడు. నందమూరి మనవడినైన నేను అంటూ ఎన్టీఆర్.. కృష్ణ గారి అబ్బాయిని అయిన నేను అంటూ మహేష్ ఇలా ఫ్యాన్స్ ను అలరించారు.
ఎన్.టి.ఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన భరత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇద్దరు స్టార్లను చూసే అరుదైన అవకాశం దొరికినందుకు ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు. ఇక ముందు తారక్ మాట్లాడి మహేష్ అన్నా అంటూ ఆప్యాయంగా ప్రసంగించాడు. ఇది తన కుటుంబ సభ్యుల వేడుక అని దీనికి తను అతిథి కానే కాదని అన్నాడు. ఇక మహేష్ లాంటి అరుదైన రకాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నాడు ఎన్.టి.ఆర్.
ఇక మహేష్ కూడా మేము మేము బాగానే ఉంటాం ఎటొచ్చి మీతోనే చిక్కు అన్నట్టు. సోషల్ మీడియాలో ట్రాలింగ్ ల గురించి చురకలేశాడు. ఇక నుండి ఇదో కొత్త ట్రెండ్ అవుతుందని ఉన్నది ఐదారుగురు స్టార్లే ఇయర్ కు ఒక సినిమానే చేస్తున్నాం అన్ని ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందని చెప్పాడు మహేష్. ఫ్యాన్స్ మధ్య కొట్లాటల వల్ల సినిమాకు బ్యాడ్ నేం వస్తున్న కోణంలో మహేష్ ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది.