సూర్య డైలాగ్ ఇంపాక్ట్ వచ్చేసింది..!

స్టైలిష్ స్టార్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి డైలాగ్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఈ డైలాగ్ టీజర్ రిలీజ్ చేశారు. సౌత్ ఇండియాకా సాలా అంటూ విలన్ గ్యాంగ్ అనగా.. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్.. ఇన్ని ఇండియాలు లేవురా మనకి ఉన్నది ఒకటే ఇండియా అంటూ బన్ని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 

అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే 4న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా కొత్తగా వచ్చిన డైలాగ్ టీజర్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. యాంగ్రీ సోల్జర్ గా అల్లు అర్జున్ సత్తా చాటుతాడని అంటున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న బన్ని నా పేరు సూర్యతో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.