
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న యాత్ర సినిమా మరో రెండు రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు వెళ్లడానికి ముందే రిలీజ్ అయిన మమ్ముట్టి వై.ఎస్.ఆర్ లుక్ ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు ప్రజల గుండెల్లో మహానేతగా ఆదరాభిమానాలు సంపాదించుకున్న వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి లుక్ లో మమ్ముట్టి అదరగొట్టాడు. ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక టైటిల్ యాత్ర లోగో కూడా అదిరిపోయింది. పాద ముద్రతో యాత్ర టైటిల్ నిజంగా సినిమాపై ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అర్ధమవుతుంది. కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండెచప్పుడు వినాలనుంది అన్న కొటేషన్ మాత్రం వై.ఎస్ అభిమానులను కదిలించి వేస్తుంది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.