
రంగస్థలం సినిమా రాం చరణ్ స్టామినాను ప్రూవ్ చేసింది కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచేలా రంగస్థలం రిజల్ట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ తమ అభిప్రాయన్ని తెలుపగా కొద్ది గంటల క్రితం రాజమౌళి ఈ సినిమాపై స్పందించడం జరిగింది. సినిమాలో సుకుమార్ రాసుకున్న క్యారక్టరైజేషన్స్ చాలా బాగున్నాయని. ఇక చిట్టిబాబుగా చరణ్ అద్భుతంగా నటించాడని ట్వీట్ చేశారు. సినిమా యూనిట్ అందరికి తన విశెష్ అందించారు.
ఇక రాం చరణ్ రంగస్థలం మీద సూపర్ స్టార్ మహేష్ కూడా తన కామెంట్ వినిపించారు. సినిమాలో రాం చరణ్, సమంత కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ట్వీట్ చేశాడు. డైరక్టర్ సుకుమార్, డిఎస్పి, రత్నవేలు ఇలా సినిమా యూనిట్ అందరికి కంగ్రాట్స్ చెప్పారు మహేష్. మార్చి 30న రిలీజ్ అయిన రంగస్థలం 130 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది.